- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాక్సినేషన్’
దిశ, రాజేంద్రనగర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా హై రిస్కు సూపర్ స్పైడర్స్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దాఖలాలు లేవని తెలంగాణ రాష్ట్రంలోనే ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని హైర్ సూపర్ స్పైడర్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ లో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ లోని ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ సోమేష్ కుమార్,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి వ్యాక్సిన్ కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని కానీ కేంద్ర ప్రభుత్వం ఇతర కారణాల వల్ల పంపిణీ చేయలేకపోతున్నారు. వ్యాక్సిన్ కొరత ఉన్నందున రాష్ట్రంలో ఎవరికి వ్యాక్సిన్ ఇస్తే కరోనా ను కట్టడి చేయగలమని ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి పథకం పెట్టారు అని అన్నారు. రాష్ట్రంలోని కిరాణా షాపులు, సెలూన్లు, మెడికల్ షాపులు, కూరగాయలు మార్కెట్, వైన్ షాపులకు రోజూ వేల మంది వస్తూ పోతూ ఉంటారు అని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఐరిస్ సూపర్ స్పైడర్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
ఈరోజు సంతోషకరమైన విషయమని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో హై రిస్కు సూపర్ స్పీడ్ వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలాంటి వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇండియాలో ఎక్కడ జరగడం లేదని త్వరలో వ్యాక్సినేషన్ విడతలవారీగా మున్సిపల్ చైర్మెన్లకు, సర్పంచులకు, వార్డు నెంబర్లకు, ఎంపీటీసీలకు ఇవ్వడం జరుగుతదని దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇంకా వ్యాక్సినేషన్ కొనడానికి గ్లోబల్ టెండర్లను కూడా పిలిచామన్నారు.
ఈ వ్యాక్సినేషన్ పక్రియకి సహకరిస్తున్న వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి అలసత్వం లేకుండా తొందరగా వ్యాక్సిన్ చేయాలన్నారు. ఈరోజు వాక్సిన్ తీసుకున్న ప్రతీ ఒక్కరికి సెకండ్ డోస్ ఎప్పుడూ అనే విషయం తప్పనిసరిగా చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీఎమ్ఏ డైరెక్టర్ సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ డిజైన్,డీఎంఎచ్ఓ స్వరాజ్య లక్ష్మి, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్,తహసీల్దార్ జనార్థన్ రావు,ఎసిపి భాస్కర్, ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.