- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
న్యూఢిల్లీ: కరోనా టీకా మూడో దశ పంపిణీ మార్చి నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. మూడో దశ వ్యాక్సినేషన్‌లో 50ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. మూడో దశ ప్రారంభమయ్యే తేదీపై ఇంకా స్పష్టత రాలేదని, రెండు, మూడు లేదా చివరి వారంలో మొదలుపెట్టే అవకాశముందని వివరించారు. జనవరి 16న తొలి దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో ఒక కోటి మంది హెల్త్ కేర్ వర్కర్లకు టీకా వేయనున్నామని, ఈ ప్రక్రియ సాఫీగా సాగుతున్నదని కేంద్ర మంత్రి తెలిపారు.
ఫిబ్రవరి 2నుంచి రెండో దశ టీకా పంపిణీ మొదలైందని వివరించారు. ఇందులో భాగంగా సుమారు రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తామని తెలిపారు. ఈ రెండు దశల తర్వాత వచ్చే నెలలో విజయవంతంగా మూడో దఫా టీకా పంపిణీ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్టు లోక్‌సభలో వివరించారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 50ఏళ్లు పైబడినవారికి టీకా వేస్తామని పేర్కొన్నారు. 2021-22 బడ్జెట్‌లో టీకాల కోసం కేంద్రం రూ. 35వేల కోట్లను కేటాయించిందని, అవసరమైతే మరిన్ని నిధులు పెంచడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు.