కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

by vinod kumar |
కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కరోనా
X

దిశ, హైదరాబాద్: కింగ్ కోఠి ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్(58) కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వైరస్ సోకడం ఇదే మొదటిసారి. కోఠి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ప్రభుత్వం ఇటీవలే కింగ్ కోఠి ఈఎన్టీ ఆసుపత్రి బాధ్యతలు కూడా అప్పగించింది. దీంతో కరోనా కేసుల విషయంలో ఆయన తరచుగా ఆస్పత్రిలో పని చేసే వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 15వ తేదీన విధులు నిర్వహిస్తూనే కోవిడ్ పరీక్షలకు నమూనాలను ఇచ్చారు. 16వ తేదీన విధులకు హాజరు కాలేదు. 17వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్‌గా రిపోర్టులు రావడంతో ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలోనే హోం క్వారెంటైన్‌లో ఉండి వైద్య సేవలు పొందుతున్నారు.

రెండు ఆసుపత్రుల్లో భయం భయం…

ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండ్‌గా, కింగ్ కోఠి ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా రెండు చోట్లా విధులు నిర్వహిస్తూ కోవిడ్ బారిన పడడంతో రెండు ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే వారు విధుల్లో భాగంగా నిత్యం సూపరింటెండెంట్‌ను తప్పనిసరిగా కలవాల్సి ఉంటుంది. పాలనా పరమైన వ్యవహారాలలో సంతకాల కోసం కింది స్థాయి ఉద్యోగులు తరచూ ఆయన వద్దకు వెళ్లవలసి ఉంటుంది. దీంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న తమకు కూడా కరోనా సోకి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబ్బంది మొత్తం వైద్య పరీక్షలకు నమూనాలు ఇస్తున్నారు. ఈఎన్టీ ఆసుపత్రిలో వారంరోజుల క్రితం ఓ సీనియర్ అసిస్టెంట్, అంతకుముందు మరో పీజీ వైద్యురాలు కరోనా బారిన పడ్డారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది, నాల్గొ తరగతి ఉద్యోగులు కూడా కరోనా భారిన పడ్డారు. సూపరింటెండెంట్‌కు పాజిటివ్ రావడంతో ఆసుపత్రి వైద్యులతోపాటు, సిబ్బందికి కూడా కరోనా గుబులు మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed