వరంగల్‌లో బ్యాంకు ఉద్యోగికి కరోనా

by Shyam |
వరంగల్‌లో బ్యాంకు ఉద్యోగికి కరోనా
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని కెనరా బ్యాంక్​ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్యాంకుకు సెలవు ప్రకటించారు. శానిటైజర్​తో బ్యాంకు పరిసరాలను శుభ్రం చేశారు. బాధితుడు హైదరాబాద్​కు చెందినవాడని.. విధి నిర్వహణలో భాగంగా అక్కడి నుండి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడని తెలిపారు. బ్యాంక్‌కు తాళం వేసిన అధికారులు కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిపివేసినట్లు గేటుకు నోటీసు అంటించారు.

Advertisement

Next Story