కేరళలో ఆకర్షిస్తున్న ‘కరోనా టెక్స్‌టైల్స్’!

by Shamantha N |
కేరళలో ఆకర్షిస్తున్న ‘కరోనా టెక్స్‌టైల్స్’!
X

దిశ, వెబ్‌డెస్క్: అదేందీ.. కరోనా ఆకర్షించడమేందీ? ప్రస్తుతం ఇప్పుడు అది అందరినీ భయపెడుతుంటే.. ఆకర్షిస్తున్నదంటున్నారేందీ… విచిత్రంగా ఉందే అని అనుకుంటున్నారా..?.. అయితే ఈ ప్రత్యేక వార్తను ఓసారి చదవండి. మీరు కూడా అవుననే అంటారు ఖచ్చితంగా!

కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. దీంతో కరోనా అన్న పదం వింటేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. ఇలాంటి ప్రస్తుత సమయంలో కేరళలో ఓ బట్టల దుకాణం ఇప్పుడు ఆకర్షణ కేంద్రంగా మారింది. ఎందుకంటే ఆ షాపు పేరే కరోనా టెక్స్‌టైల్స్. ఆ షాపులో అన్నిరకాల వస్త్రాలను విక్రయిస్తుంటారు. దీంతో ఆ ఏరియాలో అప్పటికే ఆ షాపు చాలా ఫేమస్. అంతేకాదు ఆ షాపు యజమాని పేరు పరీద్ అంటే ఎవరూ గుర్తుపట్టారు. కానీ, ‘కరోనా పరీద్’ అంటే మాత్రం ఏ ఏరియాలో అందరూ గుర్తుపడుతారు. అయితే.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఈ సమయంలో ఆ షాపు, యజమాని పేరు విని ఆశ్చర్యపోతున్నారు. షాపును చూసేందుకు చాలామంది అక్కడికి వచ్చి యజమానితో సెల్ఫీ తీసుకుంటున్నారు. దీంతో ఈ ఆ షాపు ఆకర్షణ కేంద్రంగా మారింది.

ఆ బట్టల దుకాణాన్ని ప్రారంభించినప్పుడు తన షాపు పేరు ప్రత్యేకంగా ఉండాలని, అందుకోసం డిక్షనరీలో వెతుకుతుంటే కరోనా పదం కనిపించింది. దీంతో ఆ పేరును షాపునకు పెట్టుకున్నానని యజమాని కరోనా పరీద్ తెలిపాడు. ప్రస్తుతం ప్రజలను ఇంతలా భయపెట్టిస్తున్న కరోనా పేరును తన షాపుకు పెట్టుకున్నాడు. కానీ, ఆ షాపులో ప్రత్యేకంగా శానిటైజర్స్ ఏర్పాటు చేశాడు.

Tags: Textile Shop, kerala, Coronavirus, Selfie Spot

Advertisement

Next Story

Most Viewed