- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీలోఫర్‌లో చిన్నారులందరికీ కరోనా పరీక్షలు చేయాలి
by Shyam |
X
దిశ, హైదరాబాద్: నీలోఫర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే క్రమంలో చికిత్స పొందుతున్న చిన్నారులందరికీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో పనిచేసిన డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది అంతా క్వారంటైన్‌కి వెళ్తున్న నేపథ్యంలో పిల్లల వైద్యానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రైవేటు వైద్య సేవలు గానీ, ఇతర ఆస్పత్రుల్లో ఉన్న పిల్లల వైద్య నిపుణులతో నీలోఫర్‌లో సేవలందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
tags: Coronavirus, Niloufer Hospital, Doctors, Nurses, Children, Children’s Rights Society, Hyderabad
Advertisement
Next Story