ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2020-07-29 11:15:33.0  )
ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. అంతేగాకుండా మంత్రులు, హీరోలు, పోలీసులు, డాక్టర్లు అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దర్శక ధీరుడు, టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజాటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్టు ట్విట్టర్ వేదికగా రాజమౌళి చెప్పాడు. ఆయన కుటుంబం మొత్తం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపింది. కాగా రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

Advertisement

Next Story

Most Viewed