- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంగోలు క్వారంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత!
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా పెరగుతున్నాయి. దీంతో కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఆస్పత్రల్లో బెడ్లు ఖాళీలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బెడ్లు దొరికిన పేషెంట్లకు సరైనా ఫుడ్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఒంగోలులోని కరోనా క్వారంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటల వరకు తమకు టిఫిన్ కూడా పెట్టడం లేదని కరోనా అనుమానితులు ఆందోళన చేపట్టారు. తమకు అందిస్తున్న ఆహారం క్వాలిటీగా లేదని, పశువుకు వేసే ఆహారాన్ని తమకు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆహారాన్ని తింటే వాంతులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పరీక్షలు చేయించుకుని వారం, పది రోజులు అవుతోందని… ఇంత వరకు టెస్ట్ రిపోర్టులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికి ఇంత వరకు పరీక్షలు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నెగెటివ్ రిపోర్టులు వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. వరద బాధితులను కుక్కినట్టు… అందరినీ ఒకేచోట ఉంచారని మండిపడ్డారు. మాస్కులు, శానిటైజర్లను కూడా ఇవ్వడం లేదని… తాళాలు వేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చేందుకు వారు యత్నించారు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.