- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువతా.. తస్మాత్ జాగ్రత్త.. ఈసారి మీరే టార్గెట్
దిశ, వెబ్ డెస్క్: భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభంజనం సృష్టిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ప్రపంచ రికార్డులను బద్దలుకొడుతుంది. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. కరోనా టీకాలు వేయించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. మాస్క్లు పెట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని చెప్తూనే ఉన్నారు. కానీ దేశంలో కొంతమంది ప్రజల నిర్లక్ష్యం భయాందోళనకు గురిచేస్తుంది. ఇందులో ఎక్కువ శాతం యువత ఉండడం ఇంకా బాధాకరంగా ఉంది. కరోనా గురించి పూర్తీగా తెలిసి, వేరొకరికి అవగాహన చేయాల్సిన యువతే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.
మేము వయసులో ఉన్నాం.. మాకు ఇమ్యూనిటీ లెవల్స్ ఎక్కువ ఉన్నాయి.. మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? అంటూ యువత నిర్లక్ష్యం వారి ప్రాణాలనే బలిగొంటుంది. తాజా ఆధ్యయనాల ప్రకారం కరోనా కారణంగా వెంటిలేటర్ పై ఉన్నవారందరిలో 30 శాతం మంది యువకులే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గాంధీ ఆసుపత్రిలో 30–45 ఏళ్ల వయస్సు వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. సెకండ్ వేవ్ లో యువకులే ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. గతంలో కరోనా చిన్నారుల మీద ప్రతాపం చూపింది.. ఇప్పుడు యువతని టార్గెట్ గా పెట్టుకుంది. ప్రస్తుతం హాస్పిటల్లో యువకులు సాధారణ కేసులుగా అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ వరకు వెళ్తున్నారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ 100 లో 80 మందికి ఇంటివద్దే సెల్ఫ్ ఐసోలేషన్ లోనే తగ్గుతుంది. మిగిలినవారిలో కేవలం ఐదుగురుకు మాత్రం ఆక్సిజన్ పడుతుంది. వారిలో ముగ్గురు యువకులు ఉండడం గమనార్హం. అందుకే యువతా.. జాగ్రత్త పడండి. మాస్క్ లు ధరించండి.. సామాజిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొడదాం.