ఖమ్మం జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం..

by Shyam |
Corona virus
X

దిశ,పాలేరు : తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ తిష్ట వేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెదమండవ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మొత్తం 64 మందికి టెస్ట్‌లు చేయగా.. అందులో 10మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు స్కూళ్ల ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.

తరగతి గదులను శానిటైజ్ చేసి, కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వీరికి ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఖమ్మం తరలిస్తున్నారు. మరికొంత మందికి కరోనా సోకె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మండల వైద్యాధికారులు అక్కడికి చేరుకొని విద్యార్థులకు తగు సూచనలు, జాగ్రత్తలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story