ఫేక్ న్యూస్: కరోనా సహయతా యోజన

by sudharani |
ఫేక్ న్యూస్: కరోనా సహయతా యోజన
X

దిశ, వెబ్‌డెస్క్:
పేరు వినగానే నిజంగానే ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పథకం పేరులాగ ఉంది కదా… అవును.. ఇలాంటి గుర్తిండిపోయే పేర్లు పెట్టే వాట్సాప్‌లో తప్పుడు వార్తలను ఫార్వర్డ్ చేస్తుంటారు. కరోనా నేపథ్యంలో కరోనా సహయతా యోజన ద్వారా ప్రతి ఒక్కరికీ రూ. 1000 ఖాతాల్లో వేస్తున్నట్లు ఒక నకిలీ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్త ఫేక్ అని ప్రసార భారతి స్పష్టం చేసింది.

పీఐబీలోని ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వార్త అసత్యమని ట్వీట్ చేసింది. కరోనా నేపథ్యంలో వేల సంఖ్యలో నకిలీ వార్తలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఒకటేమో ఇంటర్నెట్ ఫ్రీ అని చెప్తే, మరొకటేమో మోదీ డబ్బులేస్తాయని చెప్తాయి. ఇక కరోనా వ్యాధి గురించిన నకిలీ వార్తలైతే కోకొల్లలు. వ్యాధి ఇది చేస్తే పోతుంది, అది చేస్తే పోతుంది, ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ పిచ్చి పిచ్చిగా మెసేజ్‌లు వాట్సాప్‌లో వస్తున్నాయి. వీటన్నిటిని చదివి ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు ప్రసార భారతి ద్వారా ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా నకిలీ న్యూస్‌కి చెక్ పెడుతోంది.

Tags: PIB Fact Check, fake news, message, PIB, corona, corona sahayata yojana

Advertisement

Next Story

Most Viewed