మాజీ దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్‌కు పాజిటివ్‌

by vinod kumar |   ( Updated:2021-05-20 21:31:28.0  )
Milkha Singh
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు రోజూ అనేకమంత్రి ప్రముఖులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా.. దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ కరోనా బారినపడ్డాడు. దీంతో చండీగఢ్‌లోని ఆయన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడి సహాయకులు కొందరికి కొవిడ్‌ సోకడంతో మిల్కాసింగ్‌ కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఫ్లయింగ్‌ సిఖ్‌ పాజిటివ్‌గా తేలాడు. ‘నేను బాగానే ఉన్నా. దగ్గు, జ్వరం లేవు. నాలుగో రోజుల్లో కోలుకుంటానని డాక్టర్‌ చెప్పారు. నిన్న జాగింగ్‌ చేశా. ఎంతో ఉత్సాహంగా ఉన్నా’ అని మిల్కా వివరించాడు. అందరూ మమహమ్మారి బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు వాడుతూ, శానిటైరస్ యూజ్ చేయాలని సూచించాడు.

Advertisement

Next Story