మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్

by vinod kumar |
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్
X

కాన్పూర్: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి కరోనాబారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలగానే వెంటనే లాలాలజ్‌పత్ రాయ్ న్యూరో సైన్స్ సెంటర్ కొవిడ్ ఐసీయూ వార్డు నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించగానే తాను పరీక్షించుకున్నారని, ఇందులో పాజిటివ్ వచ్చినట్టు ఆమె ట్వీట్ చేశారు. ఈ పదిరోజుల్లో తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారు కరోనా పరీక్షలు చేయించుకుని క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఎల్ఎల్ఆర్ హాస్పిటల్ ఐసీయూలో చేరిన ఆమె ఛాతి నొప్పి సమస్య వచ్చినట్టు చెప్పగానే లక్ష్మిపత్ సింఘానియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీకి తరలించారు. శుక్రవారం రాత్రికల్లా ఆమె ఆరోగ్యం క్షీణించింది. అప్పుడే కరోనా పాజిటివ్ అని తేలగానే ఎయిమ్స్‌కు తరలించినట్టు ఓ అధికారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed