- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లింగన్న కుటుంబ సభ్యులకు కరోనా… ఆందోళనలో మంత్రి
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక పీహెచ్సీలో మంగళవారం 25 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో నలుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు వైద్యులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డితోపాటు మనవడు, మనవరాలులకు పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. రామలింగారెడ్డి అంత్యక్రియలు ఈ నెల 6వ తేదీన జరిగాయి.
అయితే రామలింగారెడ్డి దశదిన కర్మ ఈ నెల 16న ఆదివారం జరిగింది. ఆ రోజు దశదిన కర్మకు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, మానికరావు, క్రాంతికిరణ్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, సిద్దిపేట జడ్పి చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రామలింగారెడ్డి హాజరై వారిని పరామర్శించారు. అంతకు ఒకటి రెండు రోజుల ముందు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తదితరులు వారిని కలిసిన వారిలో ఉన్నారు. రామలింగారెడ్డి కుటుంబసభ్యులకు కరోనా రావడంతో దశదిన కర్మకు హాజరైన వారు ఆందోళనకు గురవుతున్నారు.