- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ మేయర్‌కు కరోనా పాజిటివ్
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ పరీక్షలు చేయించుకోవడంతో ఆదివారం పాజిటివ్‌గా తేలింది. కానీ ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మేయర్ హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఇక్కడి నుంచే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఆయన సిబ్బందిలో ఇటీవల ఒకరికి కరోనా పాజిటివ్ రాగా.. కొద్దిరోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి ఇటీవల ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఛాయ్ తాగారు. ఆ తర్వాత.. ఆ టీస్టాల్ నిర్వాహకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
అప్పటి నుంచి రెండుసార్లు టెస్టులు చేసుకున్న మేయర్‌కు నెగిటివ్ రాగా.. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. హోం ఐసోలేషన్ ముగిసి, మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే సమయానికి ప్లాస్మాదానం చేస్తానని ఆయన ప్రకటించారు. ఇటీవల ప్లాస్మా దానంపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై తో పాటు, సీపీ సజ్జనార్ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.