బల్దియా కార్పొరేటర్​కు కరోనా పాజిటివ్

by vinod kumar |
బల్దియా కార్పొరేటర్​కు కరోనా పాజిటివ్
X

దిశ, న్యూస్​బ్యూరో: జీహెచ్​ఎంసీ పరిధిలోని ఓ కార్పొరేటర్​కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సెంట్రల్​ జోన్​ పరిధిలోని సదరు కార్పొరేటర్​‌తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు కూడా సోమవారం కరోనా పాజటివ్​ వచ్చినట్టు తెలుస్తోంది. బల్దియాలో జోనల్​ కమిషనర్​కు ఇప్పటికే కరోనా పాజిటివ్ రాగా.. కార్పొరేటర్లలో తొలి కేసు కూడా అదే జోన్​ పరిధిలో చోటు చేసుకుంది. కింది స్థాయి సిబ్బందితో పాటు బల్దియాలోని కమిషనర్లు, కార్పొరేటర్లలో సైతం కరోనా బయట పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed