- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంత్యక్రియలు పూర్తి.. అనంతరం పాజిటివ్ నిర్దారణ
దిశ, జనగామ: జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన ఓ మహిళా అనారోగ్యంతో మృతిచెందగా వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. పది రోజుల క్రితం మహిళా అనారోగ్యానికి గురవగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు బ్రెయిన్ హెమరేజ్‌గా గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతిచెందింది. గురువారం కుటుంబ సభ్యులు మండల కేంద్రంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా ఆలస్యంగా అందిన రిపోర్ట్ ప్రకారం మృతురాలికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్న ముప్పై మందిని హోమ్ క్వారంటైన్ విధించారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులకు చేతిపై క్వారంటైన్ ముద్రవేశారు. గురు, శుక్రవారాల్లో ఇంటికి వెళ్లిన పోలీసు రెవెన్యూ, వైద్యాధికారులు, సిబ్బంది మందులు అందజేశారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ డాక్టర్ సూచనలు పాటిస్తూ 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మండల కేంద్రంలో కలకలం చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం మైకుల ద్వారా పోలీసులు ప్రచారం నిర్వహించారు.