తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే?

by vinod kumar |
Corona positive
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య అడ్డూ అదుపు లేకుండా రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు వేలకుపైగా రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య నమోదవవుతుండటంతో ప్రజల్లో ప్రాణభయం పట్టుకుంది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,009 కరోనా కేసులు నమోదు కాగా.. 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3.55 లక్షలకు చేరగా.. 1,838 మంది మరణించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 39,154 యాక్టివ్‌ కేసులు ఉండగా, వైరస్ నుంచి కోలుకుని 3.14లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed