ధారావిలో తగ్గుతున్న కరోనా కేసులు

by  |
ధారావిలో తగ్గుతున్న కరోనా కేసులు
X

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరు గాంచిన ధారవిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకు ఇక్కడ 220 మంది కరోనా బారిన పడగా, 14 మంది మరణించారు. ఇరుకిరుగా ఉండే ఈ ప్రదేశంలో సుమారు 8 లక్షల వరకు ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడ సామూహిక దూరం పాటించటం అనేది కుదరని పని. కరోనా నివారణకు సామూహిక దూరమే ఏకైక మార్గం. ఇందుకు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చాలా పకడ్బందీగా వ్యవహరించారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్న లక్షన్నర మందిని బయటికి రాకుండా ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానికంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. కాగా మహరాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 778 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 552 కేసులు మంబయిలోనే నమోదయ్యాయి.

Tags: corona,Mumbai,Dharavi,postive,Decline


Next Story

Most Viewed