- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలు అలర్ట్.. ఈ లక్షణాలు ఉంటే ఆ రోగం ఉన్నట్లే..!
దిశ, ఫీచర్స్: పురుషులతో పోల్చితే ఒకవైపు ఇంటి పనులు, మరోవైపు ఆఫీసు వర్క్ మధ్య అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు మహిళలు. ఫ్యామిలీ, జాబ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎదుర్కొనే ఒత్తిళ్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అయితే.. చాలా మంది మేము స్ట్రాంగ్‌గా ఉన్నాము మాకు ఏం కాదు అనే ధ్యాసలో బ్రతికేస్తుంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. కానీ, ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే మహిళల్లో ఈ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే వైద్యుడుని సంప్రదించండి అటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా విటమిన్ బి 12 లోపానికి గురవుతున్నారు. బి 12 అనేది నాడీ వ్యవస్థ పని తీరును, ఎర్ర రక్తకణాల తయారీకి ఎంతో ఉపయోగపడుతోంది. అయితే ఇది లోపించడం కారణంగా.. కండరాల బలహీనత, ఓపిక లేకపోవడం, వణుకు, నోటి పుండు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి జరిగినప్పుడు చిన్నదేలే అని వదిలెయ్యకుండా వెంటనే వైద్యుడుని సంప్రదించడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో మూడ్ ఛేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఊరికూరికే డ్రిపెషన్‌లోకి వెళ్లిపోతారు. ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఈ లక్షణాలు చాలా డేంజర్ అని చెబుతున్నారు. వెంటనే వైద్యుడుని సంప్రదించక పోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
- Tags
- health tips