- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెనరా బ్యాంకులో కరోనా కలకలం
దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం కెనరా బ్యాంకులో కరోనా కలకలం రేపుతోంది. బ్యాంకు సిబ్బంది ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో లావాదేవీల నిమిత్తము బ్యాంకుకు వచ్చే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన సిబ్బంది పదిరోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని డాక్టర్లు సూచించడంతో బ్యాంకులో సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఇప్పటికే కరోనా ప్రభావం వలన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందక పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలను రెన్యూవల్ చేసిన తర్వాత తిరిగి రుణాలను పొందే క్రమంలో బ్యాంకులో సిబ్బంది ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారని.. పదిరోజుల తర్వాత మాత్రమే రుణాలు ఇస్తామని చెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి రైతులకు రుణాలు త్వరగా ఇప్పించాలని కోరుతున్నారు.