- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరినీ హడలెత్తించిన మహిళ
దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళ చేసిన పనికి అనేక మంది కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆస్పత్రిలోని క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న ఓ మహిళా తప్పించుకుని పారిపోయింది. వైద్య సిబ్బంది కన్నుగప్పి క్వారంటైన్ కేంద్రం నుంచి బయటపడిన ఆమె ప్రజారవాణా బస్సులో ప్రయాణించింది. పాజిటివ్ లక్షణాలు ఉన్న మహిళ తప్పించుకున్నదనే విషయం గమనించిన ఆస్పత్రి సిబ్బంది.. ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు. బస్సులో కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఆమెను గుర్తించి అంబులెన్స్‌లో తిరిగి క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే, ఆమె చేరుకున్నాక వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెతో పాటు బస్సులో ప్రయాణించిన వారికి, పోలీసులకు, ఇతర వైద్యసిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మహిళ చేసిన పొరపాటుతో వారంతా టెస్టులు చేయించుకోవాల్సి వచ్చిందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.