కరోనాతో తానూర్ వాసి మృతి

by Aamani |

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి సోమవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తానూర్ వాసి రెండ్రోజుల కిందట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందినట్టు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని నిర్మల్ జిల్లా కరోనా సర్వేలెన్స్ అధికారులకు అప్పగించారు. కరోనా నిబంధనల మేరకు సోమవారం రాత్రి తానూర్‌లో అంత్యక్రియలు నిర్వహించినట్టు గామస్తులు చెప్పారు. మృతుని బంధువులు, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులను నిర్మల్ క్వారంటైన్ సెంటర్‌కు తరలించినట్టు జిల్లా కొవిడ్ 19 సర్వేలెన్స్ అధికారి డాక్టర్ కార్తీక్ తెలిపారు.

tags;corona patient died, nirmal dist, cremation at tanoor

Next Story

Most Viewed