కరోనా బాధితురాలికి కవల పిల్లలు

by Shamantha N |
కరోనా బాధితురాలికి కవల పిల్లలు
X

దిశ; వెబ్ డెస్క్: ఆమె నిండు గర్భిణి. ఇటీవల ఆరోగ్యం బాగలేకపోవడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. దీంతో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం పండంటి కవలలకు జన్మనించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది.

29 ఏళ్ల ఓ గర్భిణికీ ఇటీవల కరోనా వచ్చింది. దీంతో ఆమె పూణెలోని సోనావనే ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. శుక్రవారం నాడు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ, ఇద్దరు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే పుట్టిన కవలలకు కరోనా సోకిందా లేదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story