ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా

by vinod kumar |   ( Updated:2020-03-25 00:23:27.0  )
ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా
X

మూడు నెలల క్రితం చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తాన్నీ చుట్టేసింది. ఈ రాకాసి కరోనా ఇప్పటివరకు 197దేశాలకు విస్తరించింది. దీని బారినపడి బుధవారం వరకు 18,810మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 4,18,273మంది ఈ వైరస్‌తో పోరాడుతున్నారు.
ఇదిలా ఉండగా, అగ్రరాజ్యం అమెరికాలో దీని విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజులోనే కొత్తగా 10వేల కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి నిన్న ఒక్కరోజే 130మంది మృతి చెందారు. కాగా, ఈ వ్యాధి విస్తరించే వేగం మరింత పెరగిందని ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: coronavirus, covid-19, america, corona death toll raised, corona spread

Advertisement

Next Story