- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పెవరిదీ…?
దిశ, వరంగల్: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది జిల్లా అధికారుల పరిస్థితి. కరోనా నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండగా పరిస్థితి అదుపు తప్పడంతో వారంతా ఇప్పడు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల కిందటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు ఢంకా భజాయించి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అధికారులు చెబుతున్న మాటలకు పొంతన లేదనే వాదనలున్నాయి.
ఉమ్మడి వరంగల్లో జనగామ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా నిన్నటి రోజున రెండో కేసు నిర్థారణ అయింది. రెండు రోజుల కిందట ములుగు జిల్లాలో రెండు కేసులు నమోదవగా నిన్నటి రోజున భూపాలపల్లి జిల్లాలో సింగరేణి కార్మికుడికి కరోనా వైరస్ సోకింది. వరంగల్ అర్భన్ జిల్లా విషయానికొస్తే నిన్న సాయంత్రం కరోనా లక్షణాలున్న 25 మందిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్థారించినప్పటికీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తులంతా గత నెలలో ఢిల్లీలో జరిగిన మర్కజ్ సభలకు వెళ్లిన వచ్చినవారు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో మూడు రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలకు చేరడం పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
నిర్లక్ష్యానికి మూల్యం..?
తెలంగాణకు కరోనా ముప్పు పొంచి ఉందనే సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం మందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 24 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తోంది. కరోనా మహమ్మారి నివారణకు మందు లేనందున ప్రజలెవరూ గడప దాటి బయటకు రావొద్దని కఠిన నియమాలు ప్రవేశపెట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారిపై వైద్యుల పర్యవేక్షణలో గట్టి నిఘా పెట్టింది. పక్కా జిల్లాల్లో ( కరీంనగర్, ఖమ్మం ) పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ వరంగల్ జిల్లాల్లో ఒక్క కేసు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజుల కిందట జనగామ జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదవడం కలకలం రేపింది. ఆ తర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే రోజురోజుకు కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తనప్పటికీ గత నెలలో ఢిల్లీలో జరిగిన మర్కజ్ సభలకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా విస్తిరిస్తోందనే వాదనలున్నాయి. ఈ మహమ్మారి విస్తరించడానికి కారణం ఎవరనే ప్రశ్నలు అన్ని వర్గాలను వేధిస్తున్నాయి. జనగామ జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ సోకిన సంగతి తెలిసిందే. గత నెలలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన సదరు ఉద్యోగి ఆ తర్వాత యథావిధిగా విధులకు హాజరయ్యాడు. కలెక్టరేట్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాలకు సైతం హాజరయ్యాడు. అప్పట్లో అతడిని ఎవరూ పట్టించుకోలేదు. నిన్నటి రోజున అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
ఇంకో అడుగు ముందుకేసినా డీఆర్డీఏ పీడీ సదరు ఉద్యోగి ఎలాంటి సమాచారం లేకుండా ఢిల్లీకి వెళ్లాడని, ఇక్కడికి వచ్చిన తర్వాత యథావిధిగా విధులకు హాజరయ్యాడని అతడికి కరోనా పాజిటివ్ అని తేలినందున చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఒకవేళ సదరు ఉద్యోగి ఉన్నతాధికారి పర్మిషన్ లేకుండా ఢిల్లీకి వెళ్లితే వచ్చిన తర్వాత అతడిపై క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించినందున చర్యలు తీసుకోవాలి. కానీ, అతడు తన పక్కనే తిరుగుతున్న పట్టించుకోకపోగా ఎంచక్కా పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడే ఆ అధికారి స్పందించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదని, ఈ విషయంలో ఉన్నతాధికారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా నర్మెట మండలం వెల్ధండకు చెందిన మటన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇతడు సైతం ఢిల్లీకి వెళ్లి వచ్చాడు. తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత గ్రామస్తులు ఆ వ్యక్తిపై స్థానిక పోలీసులకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. కానీ, పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే వందల సంఖ్యలో అమాయకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడానికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు స్పష్టమవుతోందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Tags: warangal, corona, people, police, constable, officer