- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. కరోనా కొత్త లక్షణాలు ప్రకటించిన NIH
దిశ, వెబ్‌డెస్క్ : ‘కరోనా’ ప్రస్తుతం ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. 2020 ఏడాదిలో కరోనా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటికి పైగా జనాభా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొన్నటివరకు కేసులు తగ్గుముఖం పడటంతో కరోనా వెళ్లిపోయిందని అంతా భావించారు. అయితే, గతంలో కంటే ఎఫెక్టివ్‌గా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండియాలో గతేడాది ఒక్కరోజులో లక్ష కేసులు వెలుగుచూడగా, ఇపుడు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీనంతటికీ గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందడమే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇదిలాఉండగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగం(NIH) వారు జరిపిన పరిశోధనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా బారిన పడిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. మొదటి దశ కరోనా టైంలో.. రోగికి తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబడటం, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన తెలియకపోవడం, పొడి దగ్గు, ముక్కు కారకుండా జలుబు వుండేది. ప్రస్తుతం సెకండ్ వేవ్‌లో కరోనా సోకిన వారిలో కొత్త లక్షణాలను గుర్తించినట్లు NIH ప్రకటించింది. అవి ఎంటంటే : నాలుక రుచి కోల్పోవడం, నోట్లో పొక్కులు రావడం, నోరు పొడిబారడం, నోట్లో లాలాజలం ఊరకపోవడం వలన డ్రై మౌత్ సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ఆహారం తీసుకున్నా.. నీరు తాగినా నాలుక మండటం, నాలుక తడారిపోవడంతో పాలు తెల్లటి మచ్చలు ఏర్పడతాయని తెలిపింది.