- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగా లేదా మంచి హిందీ సినిమా : బోపన్న
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం మెల్‌బోర్న్ వెళ్లిన భారత డబుల్స్ ఆటగాడు రోహన్ బోప్ననకు కరోనా టెస్టులో నెగెటివ్ ఫలితం వచ్చింది. అయినా, 14 రోజులు తప్పకుండా క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘ ఈరోజు ఉదయం కరోనా టెస్టు ఫలితాలు వచ్చాయి. అందులో నెగెటివ్ అని ఉంది. కానీ, 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఎందుకంటే నేను వచ్చిన ఫైట్‌లోని ప్రతి ఒక్కరికీ నెగెటివ్ ఫలితం వచ్చే వరకు వేచి ఉండక తప్పదు. అప్పటివరకు ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం లేదు’ అని బోపన్న పేర్కొన్నారు. నాకు రోజువారీ దినచర్య ఎలాగో ఉంది. యోగ, ఫిటెనెస్ బ్యాండ్లు ఉన్నాయి. నా మెదడును ప్రశాంతంగా ఉంచడానికి అవి ఉపయోగపడుతాయి. ఏదైనా ఆన్‌లైన్ కోర్సు నేర్చుకోవచ్చు లేదా మనసు బాగుంటే ఓ మంచి హిందీ సినిమా చూస్తాను. ఆస్ట్రేలియా, ఇండియా టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నది. భారత్ బ్యాటింగ్ బాగా చేస్తుండటంతో వీక్షించాను. లైవ్ స్పోర్ట్స్ ప్రసారమైతేనే టీవీ చూడటానికి ఆసక్తి ఉంటుంది అని బోపన్న తెలిపారు.