‘గే’ అయితే చంపేయాలా..? వారి జీవితాలు హృదయవిదారకం : నటి

by Shyam |   ( Updated:2021-06-30 04:56:18.0  )
somy ali photos
X

దిశ, సినిమా : కరోనా మహమ్మారి LGBTQI కమ్యూనిటీ జీవితాలను మరింత దయనీయంగా మార్చిందని అభిప్రాయపడింది నటి సోమీ అలీ. గే కమ్యూనిటీని హ్యూమన్ ట్రాఫికింగ్, డొమెస్టిక్ వాయిలెన్స్ నుంచి కాపాడేందుకు ‘నో మోర్ టియర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పిన ఆమె.. థర్డ్ జెండర్స్‌కు పాండమిక్‌లో ఉద్యోగాలు కోల్పోయి బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, ఇది కాస్తా హింసకు దారితీసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ 20 ఏళ్ల కుర్రాడు అమ్మాయిల మాదిరిగా బిహేవ్ చేస్తున్నాడని కోపగించుకున్న తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో రోదించాడని పేర్కొంది. అదే సమయంలో ఆ అబ్బాయిని అప్రోచ్ అయిన ట్రాఫికర్.. ఆహారం, నివాసం కల్పిస్తానని నమ్మబలికి తనకు డ్రగ్స్ ఇచ్చి మరో నలుగురు పురుషులతో కలిసి రేప్ చేశాడని బాధపడింది. చాలా దేశాల్లో గే అయినందుకు ఆ వ్యక్తిని చంపేస్తున్నారన్న సోమీ అలీ.. LGBTQI కమ్యూనిటీకి చెందిన వారు ‘ఎవరితో జీవితాంతం గడపాలనుకుంటున్నారో వారిని ప్రేమించలేరు, వివాహం చేసుకోలేరు’ అనే విషయం నిజంగా హార్ట్‌బ్రేకింగ్ అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed