విమాన ప్రయాణికుడికి కరోనా.. థర్మల్ స్కీనింగ్ నార్మల్

by Shamantha N |
విమాన ప్రయాణికుడికి కరోనా.. థర్మల్ స్కీనింగ్ నార్మల్
X

కోల్‌కతా: కోల్‌కతా విమానాశ్రయ సిబ్బందికి వింత పరిస్థితి ఎదురైంది. ఈ నెల 14న ఓ ప్రయాణికుడు స్పైస్ జెట్ విమానంలో ఢిల్లీ నుంచి గువాహటి మీదుగా కోల్‌కతా వచ్చాడు. అతని దగ్గర కొవిడ్-19 సోకినట్లు రిపోర్టులు ఉన్నాయి. ఆ ప్రయాణికుడికి సిబ్బంది థర్మల్ స్కీనింగ్ చేస్తే సాధారణ ఉష్ణోగ్రతను చూపిందని కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. కరోనా పేషంట్ల బాడీ టెంపరేచర్ నార్మల్‌ కూడా ఉంటుందా అన్న అనుమానాలు వచ్చాయి. కాగా, పశ్చిమబెంగాల్‌లో 34,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య, కుటుంబ ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed