ప్రైవేటు టీచర్లకు కరోనా సాయం విడుదల

by Shyam |
private teachers
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.48వేల కోట్ల నిధులను విడుదల చేసింది. వీటిలో రూ.40వేల కోట్లు మే నెలకు కేటాయించగా రూ.8వేల కోట్లు పెండింగ్‌లో ఉన్న ఏప్రిల్ నెలకు కేటాయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జ జీఓను విడుదల చేశారు. టీచర్ల ఖాతాలో నేరుగా రూ.2వేల చొప్పున ప్రభుత్వం జత చేయనుంది.

విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం చేపట్టేంత వరకు ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్న విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ నుంచి రూ.48వేల కోట్లు విద్యాశాఖకు మంజూరైనట్టుగా విద్యాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. టీచర్ల ఖాతాల్లో నగదు జమచేసేందుకు తగిన చర్యలు చపట్టాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed