కరోనా భయం.. విజయవాడ కృష్ణలంక బంద్

by srinivas |
కరోనా భయం.. విజయవాడ కృష్ణలంక బంద్
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చనా వారిని పరీక్షలకు పంపుతున్నారు. కర్ఫ్యూ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వెళ్లకుండా నియంత్రణ పాటిస్తున్నారు. అయినప్పటికీ కరోనా భయపెట్టడం మానడం లేదు.

కృష్ణలంక రాణిగారితోటలో 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం హైఅలర్ట్‌ జోన్‌గా ప్రకటించింది. దీంతో వెంటనే రంగ ప్రవేశం చేసిన అధికారులు, ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆరోగ్య సిబ్బంది కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాలవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

మరోవైపు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆ ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. దీంతో కృష్ణలంకలోని 16, 17, 18, 20, 21, 22 డివిజన్లు పూర్తిగా బంద్ పాటిస్తున్నాయి. అత్యవసరం అయితే మాస్క్‌లు, శానిటైజర్లతో బయటకు వస్తున్నారు. ఆయా వీధుల్లో హైడ్రోక్లోరైడ్‌ క్రీమిసంహారక మందులు, బ్లీచింగ్‌ చల్లించారు. ప్రజలు రోడ్లమీద తిరుగకుండా పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags: vijayawada, krishnalanka, corona virus, covid-19,collector, ap

Advertisement

Next Story

Most Viewed