ఈ స్టార్టప్ ఎదుగుదలకు కారణం.. కరోనా!

by Harish |
ఈ స్టార్టప్ ఎదుగుదలకు కారణం.. కరోనా!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇక స్టార్టప్‌ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద పెట్టుబడులు ఉన్న స్టార్టప్ కంపెనీలే మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కానీ పుణెకు చెందిన ఒక స్టార్టప్ బిజినెస్ మాత్రం కేవలం కరోనా కారణంగానే అంచెలంచెలుగా ఎదిగింది. ఇండియాలో మాత్రమే కాదు ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా ఈ స్టార్టప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇంతకీ అది ఏం స్టార్టప్ అనుకుంటున్నారా? కరోనా వల్ల బిజినెస్ పెరిగిందంటున్నారు కాబట్టి కచ్చితంగా ఆస్పత్రి లేదా మెడికల్ సంబంధిత స్టార్టప్ అని ఊహిస్తున్నారు కదా.. అవును, మీ ఊహ నిజమే!

ఈ స్టార్టప్ పేరు జీవ్‌ట్రోనిక్స్. డిఫిబ్రిలేటర్‌లను తయారు చేసే స్టార్టప్ కంపెనీ. డిఫ్రిబిలిరేటర్ అంటే తెలుసు కదా.. ప్రాణం కొన ఊపిరితో కొట్టుకుంటున్నపుడు, దాదాపుగా ప్రాణం పోయే పరిస్థితిలో, గుండె చప్పుడును తిరిగి మామూలుగా చేయడానికి ఉపయోగించే పరికరం. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్లలో డిఫిబ్రిలేటర్ ఎక్కువగా అవసరం అవుతోంది. అయితే 2014లో ప్రారంభమైన ఈ స్టార్టప్ సంస్థ తయారు చేసే డిఫిబ్రిలేటర్ కాస్త భిన్నమైనది. శాన్‌మిత్రా 1000 హెచ్‌సీటీ అని పేరు పెట్టిన డిఫిబ్రిలేటర్‌ను ఉపయోగించడానికి బ్యాటరీలు అవసరం లేదు. జనరేటర్ విద్యుత్ ద్వారా కూడా ఇది నడుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆస్పత్రుల్లో ఉపయోగానికి ఇవి చక్కగా ఉంటాయని, రూ. లక్ష కంటే తక్కువ ధరకే తాము వాటిని అందిస్తున్నట్లు జీవ్‌ట్రోనిక్స్ సహ వ్యవస్థాపకుడు అనిరుద్ధ ఆత్రే తెలిపారు. గతంలో నెలకు 60 డిఫిబ్రిలేటర్‌లు అమ్ముడవుతుండగా, కరోనా వైరస్ విజృంభించిన నాటి నుంచి నెలకు 200 వరకు డిఫిబ్రిలేటర్‌లు అమ్ముడవుతున్నాయని ఆమె చెప్పారు.

Advertisement

Next Story