- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ ఆసుపత్రిలో కరోనా మహిళ ప్రసవం
దిశ, న్యూస్ బ్యూరో: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ చికిత్స పొందుతున్న గర్భిణీ గురువారం ప్రసవించింది. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. తల్లికి కరోనా పాజిటివ్ అయినప్పటికీ గైనకాలజీ డాక్టర్లు, సిబ్బంది నిర్భయంగా కాన్పు చేశారని వివరించారు. దీంతో ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన నలుగురికి డెలివరీ చేసినట్లు చెప్పారు. బిడ్డకు కరోనా నిర్ధారణ పరీక్షపై సూపరింటెండెంట్ స్పష్టత ఇవ్వలేదు. కరోనా పాజిటివ్ పేషెంట్లందరికీ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స జరుగుతోంది. పాజిటివ్ పేషెంట్లలో కొద్దిమంది గర్భిణీలు ఉండగా, మరికొద్దిమంది చంటి బిడ్డలతో చికిత్స పొందుతున్నారు. గర్భిణీలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా ఐసీఎంఆర్ ఇటీవల మార్గదర్శకాలు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా వాటిని అమలుచేస్తోంది. ఆ ప్రకారం గర్భిణీకి పాజిటివ్ అయినా గైనకాలజిస్టులు డెలివరీ చేయడంలో బాధ్యతాయుతంగానే వ్యవహరించారు.