- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ జూలై 4వరకు షాపులు బంద్..ఇక్కడ సాయంత్రం 4గంటలకే
దిశ, జనగామ :
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జనగామ జిల్లాలోని వ్యాపార సంఘాలన్నీ జూలై 4 వరకు స్వచ్ఛంద బంద్ ప్రకటించాయి. ఈ నిర్ణయంతో జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోని దుకాణాలు అన్ని మూసివేశారు. దీంతో రోడ్ల మీద ప్రజలు లేక బోసిపోయాయి. వారం రోజులుగా జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో జిల్లాలోని ప్రముఖ వ్యాపార సంఘాలు కొవిడ్ నివారణకు ప్రత్యేక జేఏసీని ఏర్పాటు చేశాయి. కమిటీ నిర్ణయం మేరకు పలు దుకాణాలు ఈ నెల 30 వరకు, మరికొన్ని దుకాణాలు జులై 4 వరకు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని నిర్ణయించాయి. జిల్లాలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వైరస్ నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా జనగామలోని ఆలయాల్లో భక్తులకు దర్శనం నిలిపివేస్తూ బ్రాహ్మణ సమాజ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అర్చకులు మాత్రం ధూపదీప నైవేధ్యాలు యధావిధిగా నిర్వహిస్తారని ప్రకటించింది.
భూపాలపల్లి జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వ్యాపార, వాణిజ్య సంఘాలు దుకాణాలు తెరచి ఉంచే సమయాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం నుంచి కిరాణా షాపులు, బట్టలు, ఆటోమొబైల్స్, మెకానిక్, ఎంటర్ ప్రైజెస్, మోటార్ వైండింగ్ షాపులు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంటాయని తీర్మానం చేసాయి. కావున, ప్రజలందరూ 4 గంటల లోపు పనులు పూర్తి చేసుకోవాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.