- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమస్కారమండి.. నేనే కరోనా సోకిన హేమంత్
నమస్కారమండి.. నా పేరు హేమంత్.. పారిస్ నుంచి వచ్చిన స్టూడెంట్‌ని నేనే… అంటూ కరోనా బాధితుడు ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఆకట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా విజయవాడలో ఒక కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు భాధితుడు ధైర్యంగా కరోనాతో పోరాడుతున్నాడు.
వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉంటూనే.. ఒక వీడియోను విడుదల చేశాడు.. ఆ వీడియోలో ఏమన్నాడంటే… “నమస్కారమండి.. నా పేరు హేమంత్.. పారిస్ నుంచి వచ్చిన స్టూడెంట్‌ని నేనే… నేను ఢిల్లీకి 16న వచ్చాను. పరీక్షల్లో ఏలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో.. కనెక్టింగ్ ఫ్లైట్‌కి ఒకే అన్నారు. 17న ఉదయం 7 గంటల ఫ్లైట్‌కి హైదరాబాదు 12 గంటలకి చేరుకున్నాను. అక్కడ్నించి ప్రైవేట్ క్యాబ్‌లో సాయంత్రం 6 గంటలకల్లా విజయవాడ చేరుకున్నారు. కాసేపటికి మున్సిపల్ విజిలెన్స్ టీమ్ వచ్చి, హోం క్వారంటైన్‌లో ఉండాలని చెబితే.. బాధ్యత గల పౌరుడిగా నేను ఇంట్లోనే ఉన్నాను. బయటకు వెళ్లలేదు. ఎవర్నీ కలవలేదు. సిమ్టమ్స్ కనబడగానే నేనే ఫోన్ చేసి టెస్టు చేయించుకున్నాను. ప్రస్తుతం నేను వైద్యం తీసుకుంటున్నాను. అంత బాధ్యతగా వ్యవహరించాను.. మీరంతా నాకు అండగా నిలిస్తే.. వైద్యం తీసుకుని విజయం సాధించి, చాలా మందికి స్పూర్తిగా నిలుస్తాను… దయచేసి అండగా నిలవండి” అని పిలుపునిచ్చాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు అతనిలో ధైర్యం నింపుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతే ధైర్యంగా కరోనాతో పోరాడి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. అతని ధైర్యం ఇతరుల్లో స్థైర్యాన్ని నింపుతుందని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.