ఆఖరికీ వాటర్‌ఫాల్‌‌ను కూడా కరోనా వదల్లేదు

by Anukaran |
ఆఖరికీ వాటర్‌ఫాల్‌‌ను కూడా కరోనా వదల్లేదు
X

దిశ, హుజురాబాద్: కరోనా..కరోనా ఇప్పుడు ఎక్కడా ఇదే వినిపిస్తున్నది. కరోనా ఎఫెక్ట్ మామూలుగా లేదు. దేవాలయాల నుంచి మొదలు పెడితే టూరిస్ట్ ప్లేసుల దాకా అన్నింటి కరోనా ప్రభావం ఉంటున్నది. ముఖ్యంగా టూరిస్ట్ ప్రదేశాలపై దీని ఎఫ్టెక్ట్ ఎక్కవగా ఉంటున్నది. గతేడాది ఎంతో మందిని ఆకర్షించి రాయికల్ వాటర్ ఫాల్ నేడు సందర్శకులు లేక వెలవెలబోతున్నది. కరోనా కారణంగా ఎవరూ రావడానికి ధైర్యం చేయడం లేదు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ శివారులోని వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నది. జిల్లా కేంద్రానికి 45 కి.మి దూరంలో ఉండే ఈ వాటర్ ఫాల్ అందమైన చెట్లు గుట్టల మధ్య ఉంటుంది. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి పడే జలాలతో టూరిస్టులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. దీని అందాలను చూసేందుకు వరంగల్, కరీంనగర్ చుట్టుపక్కల నుంచి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. చాలా ఏండ్లుగా ఈ జలపాతం పలు కారణాలతో మరుగున పడి ఉంది. కొంతకాలం తర్వాత స్థానికులు గుర్తించి వెలుగులోకి తెచ్చారు.

టూరిస్ట్ స్పాట్‌గా ప్రతిపాదనలు..

రాయికల్ వాటర్‌ఫాల్‌ను గతంలో కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్, సీపీ కమల్‌హాసన్‌‌‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు, ఫారెస్ట్ ఆఫీసర్లు సందర్శించారు. టూరిస్ట్ స్పాట్ గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపుతామని వారు చెప్పారు. ప్రతి ఏటా మూడు నెలల పాటు ఉండే ఈ వాటర్ ఫాల్ ను చూసేందుకు చాల మంది వస్తుంటారు. ఇక్కడికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో వచ్చిపోయే సందర్శకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కరోనా ఫోబియా..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వాటర్ ఫాల్స్ చూసేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. సందర్శకులు లేకపోవడంతో రాయికల్ దారులన్నీ వెలవెలబోతున్నాయి. ప్రతి ఏడాది ఇదే సమయానికి వచ్చిపోయే సందర్శకులతో దారులన్నీ కిక్కిరిసిపోయేవి. వ్యాపారాలు కూడా పెద్దఎత్తునా జరిగేవి. కానీ ఈ సారి పూర్తిగా సీన్ మారిపోయింది.

Advertisement

Next Story