- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా ఆజా.. బ్రాడ్‌బాండ్ బాజా!
దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ వైరస్ కరోనా ఎఫెక్ట్‌తో అమ్మకాలు, కొనుగోళ్లకు బ్రేక్ పడి ఓవైపు ఫైనాస్స్ సిస్టమ్ డిస్ట్రబ్ అవుతుంటే.. మరోవైపు బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కంపెనీలు ఫుల్ జోష్‌లో నడుస్తున్నాయి. లాభాల్లో ఉన్నప్పుడు సెన్సెక్స్ దూసుకెళ్లినట్లు ప్రజెంట్ మార్కెట్లో బ్రాడ్ బ్రాండ్ కంపెనీలు న్యూ కనెక్షన్లతో పాటు వ్యాపారంలో హండ్రెడ్ స్పీడుతో వెళ్తున్నాయి. కరోనా భయానికి చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇస్తుండటంతో నెట్ కనెక్షన్ ఇచ్చే కంపెనీల పంట పండుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలు మొత్తం వర్క్ ఫ్రం హోంకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలని చెబుతుండటంతో బ్రాడ్ బాండ్ కంపెనీల వ్యాపారం ఆకాశమే హద్దుగా సాగుతోంది. దీంతో ఆదాయంలో కంపెనీలు, వర్క్ ఫ్రం హోంతో వినియోగదారుల ఉత్తేజం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నివసించే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌తోపాటు ఇతర కంపెనీలు రక్షణ చర్యల్లో భాగంగా వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. దీంతో ఇన్నిరోజులు ఆఫీసుల్లో పనిచేసిన వారికి ఇప్పుడు ఇంట్లో నెట్ కనెక్షన్ లేకపోవడంతో కొత్త కనెక్షన్ల వైపునకు క్యూ కడుతున్నారు. వీరితోపాటు చాలామంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారు సైతం స్వీయ నిర్బంధంలో ఉండటంతో నెట్‌కు ప్రిఫరెన్స్ ఇచ్చి సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాలు చూస్తున్నారు. వారం వ్యవధిలోనే ఒక్కసారిగా నెట్‌కు భారీగా డిమాండ్ పెరగడంతో బ్రాడ్ బాండ్ కంపెనీలు మార్కెట్‌లో ఫుల్ బిజీ అయిపోయాయి. కొత్త కనెక్షన్లతో పాటు న్యూబుకింగ్స్ పెరిగి పోతుండటంతో ఓ వైపు ఎక్స్‌ట్రా ఆదాయం కోసం కసరత్తు చేస్తూ ఎంప్లాయీస్‌ను పెంచుకుంటున్నాయి.
బ్రాడ్ బ్రాండ్ ఇంటర్నెట్ కంపెనీలు అయిన యాక్ట్ ఫైబర్, హాత్ వే, ఎయిర్‌టెల్, జియో, యూ బ్రాడ్ బ్రాండ్, ఎక్స్ ఎల్, ఎక్స్ ఐ టెల్ కంపెనీలు కరోనా ఇచ్చిన జోష్‌తో దూసుకెళ్తున్నాయి. ఇదివరకు హైదరాబాద్ నగరంలో మొత్తం ఒక్కో బ్రాడ్ బాండ్ కంపెనీ రోజుకు 300 వరకు కొత్త కనెక్షన్లు ఇచ్చేది. ఇప్పుడు నెట్ వాడకం విపరీతంగా పెరగడంతో రోజుకు 750 నుంచి 800 వరకు కొత్త కనెక్షన్లు వస్తున్నాయని దిల్‌సుఖ్‌నగర్ ఏరియాలో పనిచేసే హాత్ వే బ్రాడ్ బాండ్ ఉద్యోగి సతీశ్ ‘దిశ’కు తెలిపారు. గతంలో ఒక్కో కంపెనీ నెలకు 10 వేల కనెక్షన్ల వరకు ఇచ్చేదని, ఇప్పుడున్న సిచ్యువేషన్‌తో 30 రోజుల్లో 20 వేలకు మించి కనెక్షన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంతకు ముందు టార్గెట్ పూర్తి చేయడానికి ఇంటింటికి తిరిగి ఇబ్బంది పడేవారమని ఇప్పుడు ఒక దగ్గర గొడుగు పెట్టుకొని ఉంటే వాళ్లే వచ్చి కనెక్షన్ కావాలని అడుగుతున్నారని, లేకుంటే ఫోన్ చేసి ఫలానా అడ్రస్‌లో కొత్త కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు.
ఇంటర్నెట్ వాడకం పెరుగుతుండటం వల్ల కొత్త కనెక్షన్లు వస్తుండటంతో ఆఫీస్‌కు ఉదయం 7 గంటలకే వచ్చి పంచ్ కొట్టి రాత్రి 11 గంటల వరకు పని చేయాల్సి వస్తోందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. తాము ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతలా ఇంటర్నెట్ కనెక్షన్లు సేల్ కావడం ఇదే ఫస్ట్‌టైం అని, ఈసారి కరోనా పుణ్యమా అని ఇన్సెంటివ్స్ తమ జీతం కంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Tags : Corona Virus, China, Hyderabad, Broadband, Internet, Act Fiber, Hathaway, Market, New Connections, New Bookings, Salary, Incentives