- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో బొమ్మ పడేదెప్పుడు..
దిశ, కామారెడ్డి : కరోనా రక్కసి కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. చేతివృత్తులు, కూలి చేసుకునే వారిపై మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. సినిమా థియేటర్లో పని చేసే కార్మికుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. కొత్త సినిమాలు రాక, థియేటర్లు తెరుచుకోక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో సినిమా హాల్స్ తెరవకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సినిమా హాల్స్ ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాలుగు సినిమా హాల్స్ ఉన్నాయి. గతంలో డిజిటల్ థియేటర్లుగా ఉన్న హాల్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్ గా మారిపోయాయి. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా థియేటర్ల రూపురేఖలు మార్చేశారు. విద్యుత్ వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. గతంలో ఉన్న హాల్స్ కు ఇప్పుడున్న హాల్స్ కు అసలు పోలికలే లేవు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మల్టీప్లెక్స్ గా మారిన థియేటర్లు ఇప్పుడు జనాలు లేక బోసిపోయాయి. కామారెడ్డి పట్టణంలో ప్రియ సినీ ఫ్లెక్స్ రెండు థియేటర్లు, వి శాంతి మల్టీప్లెక్స్, దర్శన్ ఏసియన్ థియేటర్లు ఉన్నాయి. ఈ నాలుగు థియేటర్లలో సుమారు 90 మంది వరకు కార్మికులు పని చేస్తున్నారు. వి శాంతిలో 15 మంది, దర్శన్ ఏసీయన్ లో 28 మంది, ప్రియ సినిప్లెక్స్ లో 42 మంది కార్మికులు పని చేస్తున్నారు.
కరోనా ప్రభావం
గత సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో మొదలైన కరోన ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. కరోన తీవ్రత దృశ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం సుదీర్ఘ లాక్ డౌన్ విధించాయి. సుమారు మూడు నెలల పాటు కొనసాగిన లాక్ డౌన్ ప్రభావం సినిమా హాల్స్ పై స్పష్టంగా కనిపించింది. లాక్ డౌన్ తర్వాత హాల్స్ తెరుస్తారులే అని ఆశించిన సినీ ప్రియులకు, అందులో పని చేసే కార్మికులకు తీవ్ర నిరాశే మిగిలింది. జనాలు ఒకేచోట గుమి గూడితే కరోన మరింత విజృంభిస్తుందని భావించిన ప్రభుత్వాలు సినిమా హాల్స్ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు.
రెండు నెలలే ఓపెన్
లాక్ డౌన్ తర్వాత షరతులు విధిస్తూ ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేసింది. ఆ సమయంలో పూర్తయిన కొన్ని కొత్త సినిమాలు విడుదల అయినా జనాలు అనుకున్నంతగా సినిమా హల్ కు రాలేకపోయారు. సుమారు రెండు నెలల పాటు సినిమా హాల్స్ ఓపెన్ గా ఉన్నాయి. కొద్దిరోజుల తర్వాత పరిస్థితులు సద్దుమనిగి ఎప్పటి స్థితికి చేరుకుంటామని కార్మికులు భావించారు. అయినా పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చి చేరింది.
సినిమా హాల్స్ ను నమ్ముకుని
సినిమా హాల్స్ లో వివిధ విభాగాల్లో కార్మికులు పని చేస్తున్నారు. థియేటర్ ఊడ్చడం, టాయిలెట్స్, పార్కింగ్, క్యాంటీన్, టికెట్ బుకింగ్, వాచ్ మెన్ ఇలా అనేక విభాగాల్లో కార్మికులు పని చేస్తూ థియేటర్ల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కరోన పుణ్యమా అని ఏడాది కాలంగా థియేటర్లు మూత పడటంతో థియేటర్ యాజమాన్యాలు వారికి జీతం ఇవ్వలేక పని మాన్పించాయి. సినిమా హాల్స్ మెయింటెనెన్స్ బాధ్యత చూసే కొంత మంది మాత్రమే ప్రస్తుతం పనిలో కొనసాగుతున్నారు.
ఓపెనింగ్ కోసం ఎదురుచూపులు
సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ పై తమ అభిమాన నటీనటులను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటిటి, డిజిటల్, ఆన్లైన్ లాంటి ప్లాట్ ఫార్మ్ ద్వారా అనుకున్నంతగా ఎంజాయ్ చేయలేక పోతున్నారు. థియేటర్ అయితే తమ అభిమాన హీరోను తెరపై చూస్తూ ఈలలు, కేకలు వేస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకులు అనేక మంది ఉన్నారు. అభిమాన హీరో సినిమా విడుదల అయితే బ్యానర్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకొనేవారు. ప్రస్తుతం కరోన ప్రభావంతో సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా.. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తామా అని అనేక మంది ప్రేక్షకులు థియేటర్ల ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.
థియేటర్ మీదనే ఆధారం
20 ఏళ్లుగా సినిమా థియేటర్లో పని చేస్తున్నాను. ఇది తప్ప నాకు వేరే పని లేదు. ఇప్పుడు ఏడాది నుంచి సినిమాలు ఆడటం లేదు. కరోన వల్ల హాల్స్ మూతపడి ఉన్నాయి. మా జీవితాలు వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. సినిమా హాల్స్ ఓపెన్ చేస్తే దీనిపై ఆధారపడి బ్రతుకుతున్న మాకు మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. ఎప్పుడు జనాలతో హల్ రద్దీగా ఉంటుందో అని ఎదురు చూస్తున్నాం.
-మొగులయ్య, దర్శన్ థియేటర్ కార్మికుడు
అప్పులే మిగిలాయి
సినిమా వ్యాపారంలో కొత్తగా అడుగు పెట్టాం. బయట వడ్డీలకు డబ్బులు తెచ్చి అన్ని హంగులతో సినిమా హల్ ను ప్రజలకు వినోదాన్ని అందించేదిగా మార్చాం. కరోన మహమ్మారి మా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. లాభాలు దేవుడెరుగు.. ప్రస్తుతం మాకు అప్పులు మాత్రమే మిగిలాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రం అవుతున్నాయి. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.
-కన్నయ్య, థియేటర్ యాజమాని
నష్టాలు చవి చూస్తున్నాం
లాభాలు వస్తాయని ఆశతో ఈ రంగంలోకి వచ్చినం. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అన్ని ఏర్పాట్లు సినిమా హాలులో సమకూర్చాము. థియేటర్లు మూత పడటం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లాభాలను చూస్తామనుకుని నష్టాలను చవి చూస్తున్నాం.
-విజయ్ గౌడ్, యజమాని