- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామచంద్రా… ఖజానా ఖాళీ, జీతాలకు కటకట
దిశ, ఖమ్మం: ‘అయ్యో రామచంద్రా.. ఏనాడు కూడా మాలో ఈ దిగులు లేదు. కానీ, ప్రస్తుతం మాకు ఇబ్బందులు తప్పడంలేదు. సగం జీతాలిచ్చినా సర్దుకున్నాం. కానీ, ఇప్పుడు అది కూడా లేదనిపిస్తోన్నది’ అనే ఆందోళన ప్రస్తుతం వినిపిస్తోన్నది. కారణమేమిటంటే.. అందుల్లోంచే వీరికి చేరుతుంటాయి. కానీ, ఉరుములేని పిడుగులా వచ్చిన దాని కారణంగా ఇప్పుడు అవేమీలేవు. అంతేకాదు పరిస్థితి ఇలానే కొనసాగితే ఆ నిర్వహణే ప్రశ్నార్థకం కానుంది. అదేమిటో ప్రత్యేక కథనంలో..
భద్రాద్రి రాముడికి లక్ష్మీకటాక్షం కరువైంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల్లోకి భక్తులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతి గాంచిన భద్రాచలంలోని సీతారాముల ఆలయంలో భక్తల సందర్శన నిలిచిపోయింది. శ్రీరామనవమి వేడుకలు కూడా నిరాడంబరంగా జరిగాయి. అతికొద్దిమంది ఆలయ సిబ్బంది, దేవాదాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వేడుకలు ముగిశాయి. అయితే ప్రతీయేటా శ్రీరామనవమి వేడుకల ద్వారానే ఎక్కువ మొత్తంలో ఆలయానికి ఆదాయం సమకూరుతూ వస్తోన్నది. దాదాపు ఈ ఆదాయం రూ. రెండున్నర కోట్ల వరకు ఉంటుంది. హుండీలు, విరాళాలు, ఇతర మార్గాల ద్వారా దాదాపు మరో రెండు కోట్ల వరకు ఆదాయం సమకూరుతూ ఉండేంది. ఇలా వచ్చిన ఆదాయంతో ఆలయ నిర్వహణ జరుగుతది.
అయితే ఉరుములేని పిడుగులా ఈ సారి కరోనా ఎఫెక్ట్‌తో శ్రీరామ నవమి వేడుకలకు భక్తులను అనుమతించకపోవడంతో ఆలయ ఆదాయ మార్గాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. గతేడాది ఇదే సమయానికి దాదాపు రూ. 4.5 కోట్ల ఆదాయంతో ఆలయ ఖజానా కళకళలాడింది. ఇదిలా ఉండగా ఆలయ పరిధిలో దాదాపు 100 మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. అలాగే 90 మంది పెన్షనర్లు ఉన్నారు. ఔట్ సోర్సింగ్, హౌస్ కీపింగ్, లేబర్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారు 167 మందికి పైగా ఉంటారు. వీరే కాక పదిమంది పార్ట్‌టైమ్ ఉద్యోగులు, 21 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వీరందరికీ ఆలయం ద్వారా సమకూరిన ఆదాయం నుంచే జీతాలు చెల్లించాల్సి ఉంది.
నెల జీతాల చెల్లింపునకే రూ. 90 లక్షల వరకు అవసరం ఉంటుంది. అయితే లాక్‌డౌన్ మార్చి 24 నుంచి అమల్లోకి రావడంతో మార్చి, ఏప్రిల్ మాసాలకు సంబంధించి 50 శాతం జీతం మాత్రమే చెల్లించారు. అయితే మే మాసానికి సంబంధించిన సగం జీతమైనా జూన్‌లో అందుతుందో లేదోనన్న భయాందోళన ఆలయ సిబ్బందిలో మొదలైంది. వాస్తవానికి ఆలయానికి సంబంధించిన రూ.45 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిటిట్లు ఉన్నప్పటికీ దేవాదాయశాఖ ఉన్నతాధికారుల జోక్యంతో గానీ వాటిని వినియోగించుకోవడానికి వీలు లేకుండా ఉందని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆలయ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారనుంది.