24 గంటల్లో 996 మంది మృతి

by Anukaran |
24 గంటల్లో 996 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావానికి ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. దీంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోపక్క వర్షాలతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు.

తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 65,002 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 25,26,192కు చేరింది. ఇందులో 18,08,936 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6,68,200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో 996 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 49,036 మంది కరోనాతో మృతిచెందారు.

Advertisement

Next Story