- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా దహనాలు… ఒక్కో శవానికి ఇంత..?
దిశ, పోచమ్మమైదాన్ : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సమీపంలోని స్మశాన వాటికలో శవ దహనాలు విరివిగా కొనసాగుతున్నాయి. శవాలు ఎక్కడివో కాదు ఎంజీఎం ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి మృత దేహాలు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు, మనిషి చనిపోయిన తరువాత తమకెందుకు అనుకునేవారు, శవాన్ని ఇంటికి తీసుకపోతే యజమాని, అభ్యంతరం చెబుతారని అద్దె ఇండ్లలో నివసిస్తున్న వారు ఇలా పలు కారణాలతో వైద్య సిబ్బందికి(స్వీపర్లు, వార్డులు శుభ్రం చేసే కొందరికి) చేతిలో అంతో ఇంతో పెట్టి తమ బంధువుల శవాలను వదులుకుంటున్నారు.
ఒక్కో శవానికి 5000 పైనే….
ఒక్కో శవానికి మృతుల బంధువుల స్థాయినిబట్టి సిబ్బంది 5000పైనే డిమాండ్ చేస్తున్నారు. తమ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మృతుల బంధువులు ఏదో విధంగా డబ్బులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ కూడా కొందరు సిబ్బంది పోటీ పడుతున్నారు. ఈ లెక్కన సిబ్బందిలో ఒక్కోరు రూ,15వేల పైనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
నిర్లక్ష్యానికి మూల్యం.?
ఎంజీఎం ఆసుపత్రిలో కొందరు సిబ్బంది కారణంగా రోగుల బంధువులు నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంటునట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది వేసుకున్న పీపీఈ కిట్లు విధులు ముగించుకొని వాటిని ఎక్కడపడితే అక్కడ విసిరి పడేస్తున్నారు. దీనితో కొందరు ఆటువైపుగా వెళ్లివస్తూ కరోన బారిన పడుతూ ఆస్పత్రిలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కిట్లకోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లో వేయాలని వైద్యులు, అధికారులు పదేపదే చెబుతున్నా వారు చేసేదే చేస్తున్నారు.