- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబర్ చివరిలోగా అదుపులోకి కరోనా..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మెడికల్ ఎడ్యూకేషన్ డైరక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోపు జీహెచ్‌ఎంసీ పరిధిలో, సెప్టెంబర్ చివరిలోపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. నగరంలో ఐసోలేషన్ సౌకర్యం అందుబాటులో లేనివారికి ప్రత్యేకంగా కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నవారికి యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉండాలని.. వారి ద్వారా ప్మాస్లా ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పారు. అయితే, అందరికీ ప్లాస్మా వైద్యం అవసరం లేదని.. సీరియస్ కండీషన్‌లో ఉండి కోలుకున్న వారి ప్లాస్మా మాత్రమే అవసరమని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన కరోనా కేసులు తగ్గుతున్నాయని రమేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 18వేల పడకలకు ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.