- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభన
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల ఒకటి నుంచి కరోనా కేసులు రెట్టింపవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 216 కేసులు నమోదవగా, అందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 34,482 మందికి కరోనా టెస్టులు చేశారు. కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో వైద్యారోగ్యశాఖ సత్వర చర్యలను చేపట్టింది. టెస్ట్, ట్రేస్, ట్రీట్ ప్రక్రియను వేగవంతం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు జిల్లాల్లో రోజుకు 50 వేల వరకు కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి జాబితాను సేకరించి వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. వ్యాధి సోకిన వారికి కరోనా టీకాలు అందించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకుంటే వ్యాధి వ్యాప్తిని అరికట్టడం సాధ్యంకాదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
24 గంటల్లో 216 కేసుల
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 34,482 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించగా వీరిలో 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఈ నెల 1న 116 పాజిటివ్ కేసులు నమోదుకాగా 8న 111 కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన వారిలో అత్యధికంగా 23 శాతం పాజిటివ్ కేసులు 20 నుంచి 40 ఏళ్లు వయసు వారికే సోకుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 52 కేసులు నమొదుకాగా కొమరంభీం ఆసీఫాబాద్, ములుగు, నారాయణపేట, సూర్యాపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. జిల్లాల వారీగా ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 6, జగిత్యాల 6, జనగాం 4, జయశంకర్ భూపాలపల్లి 4, జోగుళాంబ గద్వాల 1, కామారెడ్డి 5, కరీంనగర్ 11, ఖమ్మం 6, మహబూబ్ నగర్ 6, మహబూబాబాద్ 3, మంచిర్యాల 6, మెదక్ 1, మల్కాజ్‌గిరి 18, నాగర్ కర్నూల్ 1, నిర్మల్ 3, నిజామాబాద్ 3, పెద్దపల్లి 4, రాజన్న సిరిసిల్ల 6, రంగారెడ్డి 19, సంగారెడ్డి 8, సిద్దిపేట 7, వికారాబాద్ 2, వనపర్తి 2, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 11, యాదాద్రి భువనగిరిలో 4 కేసులు నమోదయ్యాయి.