- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో తగ్గిన కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 43,044మందికి పరీక్షలు నిర్వహించగా 753మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8లక్షల 54వేల 764కు చేరింది. 13మంది చనిపోవడంతో మొత్తం మృతుల సఖ్య 6,881గా ఉంది. ప్రస్తుతం 17,892 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,29,991మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 1,507మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 91 లక్షల 97వేల 307 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు
అనంతపురం జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 87, తూర్పుగోదావరిలో 130, గుంటూరులో 50, కడపలో 66, కృష్ణా జిల్లాలో 76, కర్నూలులో 12, నెల్లూరులో 14, ప్రకాశంలో 36, శ్రీకాకుళంలో 25, విశాఖపట్నంలో 25, విజయనగరంలో 12, పశ్చిమగోదావరిలో 216 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.