ప్రభుత్వ పాఠశాలల్లో కొరలు చాస్తోన్న కరోనా

by Shyam |
Corona virus
X

దిశ, ధర్మపురి/మునుగోడు/ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లాలో 21 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన 20 మంది విద్యార్థులకు, కోరుట్ల కస్తూర్బా పాఠశాలలో ఒక విద్యార్థికి, సారంగాపూర్​మండలంలో ఆరుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌ వచ్చింది.

చౌటుప్పల్‌లో తొమ్మిది కేసులు

చౌటుప్పల్‌లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. శనివారం చౌటుప్పల్ జూనియర్ కళాశాలలో 34 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి, సామాజిక ఆరోగ్య కేంద్రంలో 52 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

ఖ‌మ్మం జిల్లాలో 16 మందికి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెదమండవ గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో 10 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మొత్తం 86 మందికి టెస్ట్‌లు చేయగా.. 10 మందికి పాజిటివ్ వచ్చింది. ఖానాపురం పోలీస్ స్టేష‌న్‌లో ఆరుగురు సిబ్బందికి కరోనా సోకింది. స‌త్తుప‌ల్లి, మ‌ధిర‌, వైరా ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుప‌త్రికి క‌రోనా కేసులు వ‌స్తున్నాయని వైద్యాధికారులు తెలిపారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శానిటైజ్ చేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story