‘మహా’లో కరోనా అల్లకల్లోలం..

by vinod kumar |
‘మహా’లో కరోనా అల్లకల్లోలం..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో డబుల్ మ్యుటేషన్ కేసులు అక్కడి ప్రజలతో పాటు ఆ రాష్ట్ర సరిహద్దులను పంచుకుంటున్న ఇతర రాష్ట్రాలను కూడా నిద్రలేకుండా చేస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్తున్న కూలీలు కరోనాను వెంటబెట్టుకుని వెళ్తున్నారు.

దీంతో అక్కడ కూడా కేసులు విపరీతంగా పెరగుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ‘మహా’లో గడచిన 24 గంటల్లో 68,631 కేసులు నమోదు కాగా, 503 మంది మృతి చెందారు. ముంబైలో ఒక్కరోజే 53 మరణాలు సంభవించగా, 8,479 కేసులు వెలుగుచూశాయి.

Advertisement

Next Story

Most Viewed