ఒక్క రోజులో కరోనా కేసులు ఎన్నంటే…

by  |
ఒక్క రోజులో కరోనా కేసులు ఎన్నంటే…
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని డిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ఢిల్లీలో 2,312 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత రెండు నెలల్లో ఇంత పెద్ద సంఖ్యలో కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో కేసుల సంఖ్య సుమారు 1లక్షా 80వేలకు చేరుకుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4462 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఈ రోజు కరోనాతో 18మంది మరణించారు. మరో వైపు రికవరీ రేటు కూడా 88.5 శాతంగా ఉన్నది.

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 36,91,167 కేసులు నమోదయ్యాయి. కాగా కేవలం ఈ రోజు గత 24 గంటల్లో 69,921కేసులు నమోదయ్యాయి. కాగా తాజాగా కరోనాతో 819 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 65,288 చేరింది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883గా ఉంది. వారిలో గడిచిన 24గంటల్లో 65,081 మంది కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య విషయానికి వస్తే 7,85,996 గా ఉంది. దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల రికవరీ రేటు 76.94 శాతంగా ఉందని తెలిపింది.


Next Story

Most Viewed