ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు.. మొదటిసారి భయం లేదంటున్న వైద్యులు

by vinod kumar |   ( Updated:2021-05-21 06:01:43.0  )
ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు.. మొదటిసారి భయం లేదంటున్న వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. రోజురోజుకు కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతుండడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక గతనెల అత్యధిక కేసులు నమోదైన దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 3,009 కరోనా కేసులు నమోదయ్యాయి. 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాజిటివిటీ రేటు 4.76 శాతం దిగువకు పడిపోయింది. ఏప్రిల్ 4 తరవాత పాజిటివిటీ రేటు తగ్గడం ఇదే మొదటిసారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 5 శాతం లోపు పాజిటివిటీ రేటు నమోదైతే ఆ ప్రాంతం సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడిలో లాక్ డౌన్ ఎంతగానో ఉపయోగపడిందని వైద్యులు తెలుపుతున్నారు. నెలనుంచి కరోనా కేసులుతో నిండిపోయిన ఢిల్లీ హాస్పిటల్స్ ప్రస్తుతం కేసులు తగ్గడంతో ఊపిరి పీల్చుకొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed