ఆ దేశంలో ఘోరం.. రోజురోజుకు..

by vinod kumar |
ఆ దేశంలో ఘోరం.. రోజురోజుకు..
X

బ్రసిలియా: బ్రెజిల్ లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడుతున్నారు. తాజాగా గురువారం ఆ దేశం పేర్కొన్న లెక్కల ప్రకారం 43,829 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రెజిల్ దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20, 14,738 కు చేరింది. అంతేకాదు నిన్న ఒక్కరోజే 1,299 మంది మృతిచెందారు. కేవలం మూడు నెలల్లోనే ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది.

Advertisement

Next Story